జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లె గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు ఎస్సీ సెల్ టిఆర్ఎస్ నాయకులు బండారి రాజ్ కుమార్ సోమవారం జమ్మికుంట తహశీల్దార్ రమేష్ బాబు ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియ జేశారు అదే గ్రామానికి చెందిన బండారి సమ్మక్క చంద్రయ్య కుమార్తె జ్యోతి కి వివాహం జరుగగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కును రమేష్ బాబు చేతుల మీదుగా బండారి సమ్మక్క కు అందజేశారు లబ్ధి దారులు తహసీల్దార్ కృతజ్ఞతలు తెలిపారు హుజురాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు తహశీల్దార్ రమేష్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దళితరత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు కే.శ్రీకాంత్ సి హెచ్ మధునయ్య, జి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Latest News
