Site icon PRASHNA AYUDHAM

ఆర్ అండ్ ఆర్ కాలనీ పేరిట కోట్లు దండుకున్న బిఆర్ఎస్ నేతలు

WhatsApp Image 2025 03 08 at 3.02.28 PM

ఆర్ అండ్ ఆర్ కాలనీ పేరిట కోట్లు దండుకున్న బిఆర్ఎస్ నేతలు

– నిర్వాసితుల ఉసురు కెసిఆర్ కు తప్పకుండా తగులుతుంది

– గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి

– గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్
గజ్వేల్, 08 మార్చి 2025 : బిఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డికి గజ్వేల్ ప్రజలు మూడు సార్లు బుద్ధి చెప్పినా సిగ్గు తెచ్చుకోకుండా నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్,  వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహారెడ్డి విమర్శించారు. శనివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వం కోల్పోయిన ఆర్ అండ్ ఆర్ కాలనీ బాధితులతో కలిసి వారు మాట్లాడారు. మల్లన్న సాగర్ నిర్మాణం పేరిట ఏడు గ్రామాల ప్రజలను కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, వారి తాబేదార్ ప్రతాప్ రెడ్డి నిలువునా మోసం చేసి అనుచరులకు నిబంధనలకు విరుద్ధంగా వందల కొలది ప్లాట్లు, రూ కోట్ల నగదు దోచుపెట్టినట్లు విమర్శించారు. కెసిఆర్ క్యాంపు కార్యాలయంలో స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి ఇంటికి రవాణ, ఇతర ఖర్చుల కింద రూ 50 వేలు ఇచ్చినట్లు ప్రకటించగా, మరి ఆ నిధులు ఏమయ్యాయని, ఎవరికి దోచిపెట్టారని నిలదీశారు. ముఖ్యంగా నిర్వాసిత గ్రామాలలో బాధితులకు తీవ్ర అన్యాయం చేసిన బిఆర్ఎస్ నేతలు అక్రమంగా స్థలాలు కబ్జా చేసినట్లు ఆరోపించారు. కనీసం గుడి, బడి, స్మశాన వాటిక, కబ్రిస్తాన్ లకు సైతం స్థలాలు మిగలకుండా కాజేసిన నీ అనుచరులను ముందు నిలదీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అండతోనే అవినీతి, అక్రమాలకు పాల్పడగా, నిలదీసిన పలువురిని హత్య చేసేందుకు సైతం కుట్రలు పన్నిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అంతేకాకుండా గజ్వేల్ ఇందిరా పార్క్ నుండి కోట మైసమ్మ వరకు రోడ్డు విస్తరణలోని బాధితులను ఆదుకుంటామని హామీ ఇవ్వగా, అధికారం కోల్పోయాక కల్లబొల్లి మాటలతో బాధిత కుటుంబాలను రెచ్చగొట్టడం సిగ్గుచేటని నిలదీశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుపేదలకు ఇండ్ల పంపిణీ పేరిట రాజకీయం చేసిన ప్రతాప్ రెడ్డి మరి వారికి ఇండ్లు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. లాటరీ పద్ధతిన లబ్ధిదారులను గుర్తించిన అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ప్రతాపరెడ్డి కొంతమంది కౌన్సిలర్ల అండతో ఆ లిస్టును తొక్కి పెట్టి మున్సిపల్ లో రాజకీయం చేసింది ఇంకా గజ్వేల్ ప్రజలు మర్చిపోలేదని అన్నారు. పదేళ్లపాటు కేసీఆర్ హరీష్ రావులతో అంటగాగిన ప్రతాపరెడ్డి ప్రస్తుతం ఆ నెపాన్ని కాంగ్రెస్ పై నెట్టడం ఆయన నీతిమాలిన రాజకీయాలకు అద్దం పడుతుందని విమర్శించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కాకుండా ప్రతాప్ రెడ్డి మాట్లాడడం తగదని, దమ్ముంటే కేసీఆర్ ను బయటకు లాగాలని, సెక్రటేరియట్ కాకుండా ముందు కాకుండా కేసీఆర్ ఫాo హౌజ్ ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత గ్రామాల ప్రజలు, మున్సిపల్ పరిధిలోని పేదలు ప్రతాప్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వివరించారు. ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, యాదయ్య, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, నాయకులు కుట్ల లక్ష్మారెడ్డి, నక్క రాముడు గౌడ్, అంజి యాదవ్, ఉడెం శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి లక్షమ, జహీర్, జహంగీర్, డప్పు గణేష్, బలగౌడ్, దయ్యాల యాదగిరి, శ్రవణ్, అరుణ్, ఆర్ అండ్ ఆర్ కాలనీ నాయకులు, ఉపేందర్, ప్రమోద్, పిట్ల శ్రీను, రాములు, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version