దీక్ష దివస్ కార్యక్రమానికి ఖేడ్ నుండి తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు
నారాయణఖేడ్ మండలం నుండి బీఆర్ఎస్ నాయకులు సంగారెడ్డికి బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే దీక్ష దివస్ కార్యక్రమానికి నారాయణఖేడ్ పట్టణంలోని తాలూకా పార్టీ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. 15 ఏళ్ల దీక్ష దివస్ సందర్భంగా అమరులైన ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఇందులో పార్టీ నియోజకవర్గ నాయకులు రవీందర్ నాయక్, నాగేష్, తదితరులు ఉన్నారు.