కొత్తగూడెంలో బీఆర్ఎస్ సమావేశం

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 25 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
దీక్షా దివస్ ను విజయవంతం చేయడంలో భాగంగా కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో సోమవారం సాయంత్రం పార్టీ ప్రముఖులు, నాయకులు సమావేశమయ్యారు.తెలంగాణ రాష్ట్ర సాధనకు బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2009 నవంబర్ 29వతేదీన ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఈ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ ప్రతిఏటా నవంబర్ 29వతేదీని దీక్షా దివస్ గా పాటిస్తూ బీఆర్ఎస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.దీక్షా దివస్ భద్రాద్రి కొత్తగూడెం ఇంఛార్జిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు.దీక్షా దివస్ ను విజయవంతం చేయడంలో భాగంగా దాని ఇంఛార్జి ఎంపీ రవిచంద్ర సూచన మేరకు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యతన సన్నాహాక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ హరిసింగ్ నాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ దిండిగల రాజేందర్,కొత్తగూడెం మునిసిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment