బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు.

ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది త్వరలో చెబుతామన్నారు. ఆ ఎమ్మెల్యేలు.. మా పార్టీలో చేరే తేదీలు సైతం తెలియజేస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీఎన్‌తో రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక తమ వైపు వారు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలే కాదని.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. ఆగస్ట్ 10వ తేదీన బీజేపీలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరనున్నారని తెలిపారు. బీజేపీలో చేరికలకు ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలా పార్టీలో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు దోషులు బయటకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు. అయితే ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అయన అసహనానికి పరాకాష్టగా తెలంగాణ బీజేపీ చీఫ్ అభివర్ణించారు. బీసీల మీద ప్రేమ.. సీఎం రేవంత్ రెడ్డికి కొత్తగా వచ్చిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment