రైతు భరోసా నిధుల విడుదలకు డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ధర్నా – పటాన్‌చెరు నియోజకవర్గం

*రైతు భరోసా నిధుల విడుదలకు డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ధర్నా – పటాన్‌చెరు నియోజకవర్గం*

పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు నేతృత్వం మరియు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో “రైతు భరోసా” నిధులు వెంటనే విడుదల చేయాలంటూ మహా ధర్నా నిర్వహించబడింది.

ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు , జిల్లా ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మి రెడ్డి, మాణిక్ రావు, డి.సి.ఏం.ఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్ మరియు మఠం బిక్షపతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –

పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, జిన్నారం, పటాన్‌చెరు, అమీన్పూర్ మండలాల్లో కలిపి సుమారు 42,302 ఎకరాల భూమికి రైతులు ఆధారపడుతున్నారు. అయితే ఇప్పటివరకు 27,120 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కాకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా రైతులకు నిధులు నిలిపివేయకుండా అందించిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు కాకుండా ఉండటం, రైతులపై తీవ్ర అన్యాయం జరగడం, ఇది “కోతల ప్రభుత్వం” అనే వాస్తవాన్ని నలుదిశలా చాటుతోందని వారు అన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. రైతులకు తక్షణమే న్యాయం జరగాలని వారు కోరారు.అనంతరం ఏం.ఆర్.ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,గుమ్మడిదల మండలం సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు గోవర్దన్ రెడ్డి, తెల్లాపూర్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్,,జిన్నారం మండలం అధ్యక్షుడు రాజేష్,గుమ్మడిదల మండలం అధ్యక్షడు ప్రభాకర్ రెడ్డి,సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్,తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్,నియోజవర్గ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment