సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పంచాయతీ కిష్టాయపల్లి గ్రామంలో రైతు బసెటి సంతోష్ కుమార్ కు చెందిన 18 గేదెలు రసాయన జలాలు సేవించి మృత్యువాత పడ్డాయి. మంగళవారం పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశ్రమలపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి, ఆదర్శ రెడ్డి, వెంకటేష్ గౌడ్, ప్రకాష్ చారీ, తొంట అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, సురేందర్ గౌడ్, జనార్దన్, ఆంజనేయులు, కదీర్, ఆకుల నవీన్, బసేటి రాజు, వేణు, వెంకటేష్, పెంటేష్, కుమార్, శ్రీధర్, పరమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ గౌడ్, గణేష్, భీమ్ రావు,రావుల ఆంజనేయులు, ఆకుల కిరణ్, నాగేష్, కార్తీక్, బాలు, చిరంజీవి, సత్యనారాయణ చారీ, నవీన్, దేవయ్య, యాదగిరి, శ్రీరాములు, అనిల్, బిక్షపతి, కుమార్, మల్లికార్జున్, సుధాకర్, మాచబోయిన నర్సింగ్ రావు, ధర్మయ్య, కే. శ్రీకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
*బాధిత కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు*
Published On: August 28, 2024 11:52 am
