దీక్ష దీవాస్ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

దీక్ష దీవాస్ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

అచ్చంపేటలో శుక్రవారం దీక్ష దీవాస్ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అమీనోద్దీన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మన ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అని గుర్తు చేశారు. తన ప్రాణమే ఫణంగా పెట్టి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది *”తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో “* అని గర్జించి దశాబ్దాల అన్యాయంపై ఆమరణ దీక్షతో తిరుగులేని అస్త్రం సంధించి ప్రతి తెలంగాణ బిడ్డను ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ మెడలు వంచిన అపూర్వమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల పిఎసిఎస్ అధ్యక్షులు మంద రాజిరెడ్డి, బల్మూర్ మండల నాయకులు బండపల్లి వెంకటయ్య, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ మాదిగ, సర్పంచుల సంఘం వంగూర్ మండల మాజీ అధ్యక్షులు అంకూరి అంజి, రంగాపూర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment