కోటగిరి లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం
ప్రశ్న ఆయుధం 21 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో మాజీ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మోరే సులోచన కిషన్ నివాసం వద్ద బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బాన్సువాడ నియోజకవర్గ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత మొదలైందని కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులే ఎప్పటికి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయని ఏ ఇంట చూసినా టిఆర్ఎస్ పార్టీ పథకాలు లేని ఇల్లు లేదని ఆయన అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మోరే కిషన్ యువ నాయకులు సమీర్, పోతంగల్ మండల నాయకులు సుదం నవీన్, మాజీ ఎంపీటీసీ పారూక్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,మాజీఉపసర్పంచ్ దేవేందర్,నాయకులు దిలీప్ పటేల్, తెల్లా అరవింద్,అంబటి గంగా ప్రసాద్,కప్ప సంతోష్,రాజు,విష్ణు, ఆరిఫ్,ఎజాస్,ముక్తార్,హైమద్, ఆంజనేయులు,బాన్సువాడ నాయకులు రమేష్ యాదవ్, సాయిబాబా,గాండ్ల కృష్ణ,యూత్ నాయకులు శివ సూరి, మన్నె అనిల్,లక్ష్మణ్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .