దుద్దాల అంజిరెడ్డి కి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
ప్రశ్న ఆయుధం 25 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి )
మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి హైదరాబాదులోని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు.గులాబీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి యువ నాయకుడు శివసూరి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘనవిజయం సాధించబోతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్,మోచీ గణేష్, ఎర్ర వట్టి సాయిబాబా,రమేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.