Site icon PRASHNA AYUDHAM

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లకు ఘనంగా బిఆర్ఎస్ సన్మాన సభ 

Galleryit 20251224 1766572122

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లకు ఘనంగా బిఆర్ఎస్ సన్మాన సభ

 

బిఆర్ఎస్ పార్టీ అధికారంలోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 24

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికై ఎన్నో విన్నుత మైన ప్రభుత్వ పథకాలను ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ అందించిందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం రోజున కామారెడ్డి పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ,ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు, ఉప సర్పంచ్ లకు ,వార్డ్ మెంబర్లను సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, కాంగ్రెస్ పార్టీ అనేగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతులకు రైతుబంధు, రైతు భరోసా, నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ కళ్యాణ్ లక్ష్మీ తో పాటు తులం బంగారం ఇస్తామని ,వృద్ధులకు పెన్షన్ల పెంపు ,ఒంటరి మహిళలకు 2500 హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇచ్చిన హామీలను పార్టీ నెరవేర్చలేదని, అలాగే గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే నిధులు విడుదల చేయవమని బెదిరించి అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను బెదిరించిన 50% ఆ పార్టీ విజయం సాధించలేదని అన్నారు. నాడు బిఆర్ఎస్ పార్టీ హయాంలో కెసిఆర్ పాలనలో 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ వాటర్, సాగునీటికి అనేక ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందివడంలో విఫలమైందని వచ్చే మూడేళ్లలో బి ఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీకి మెరుగైన స్థాయిలో పోటీ అందించారని కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నూతన కార్యకర్తలకు పార్టీ కండవలతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version