సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో డంపుయార్డు ఏర్పాటు వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్ తరాలకు ఇది ముప్పుగా మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గుమ్మడిదల సీజీఆర్ కార్యాలయంలో గురువారం చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. డంపుయార్డు ఏర్పాటు చేయొద్దని శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని, డంపుయార్డు వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్ తరాలకు ఇది ముప్పుగా మారుతుందని తెలిపారు. డంపుయార్డు రద్దు చేయకుంటే రాస్తారోకో, ధర్నాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి రోజు గుమ్మడిదలలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, రైతులు, కార్మికులు, వర్తకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు స్వయంగా దీక్షలో పాల్గొంటున్నారని అన్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున దీక్షల్లో కూర్చుని మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. డంపుయార్డు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టులో కేసు వేస్తామని చెప్పారు. మా గళం అసెంబ్లీలో వినిపిస్తామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతామని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. గుమ్మడిదల పరిసర ప్రాంతాలు పచ్చని అడవులతో నిండి ఉన్నాయని, వన్యప్రాణుల జీవనానికి డంపుయార్డు ముప్పు కలిగిస్తుందని గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి లేదని, అయినప్పటికీ అడవిని నాశనం చేసి డంపుయార్డు ఏర్పాటుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఇది అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. డంపుయార్డు రద్దు చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే డంపుయార్డు ప్రాజెక్టును రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
డంపుయార్డు రద్దు చేయకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

Oplus_131072