సంగారెడ్డి/పటాన్ చెరు, మే 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): అకాల వర్షంతో జిన్నారం, గుమ్మడిదల మండలలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్టాలకు గురయ్యారని, వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుమ్మడిదలలోని సీజీఆర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా భారీ వర్షాలు పడటం వల్ల పంటలు పూర్తిగా నాశనమయ్యాయని, ముఖ్యంగా వరి, కూరగాయల పంటలకు భారీ నష్టం జరిగిందని అన్నారు. ఎంతో శ్రమించి పండించిన పంటలు చేతికి వచ్చే సమయానికి ఈ విపత్తు రైతులను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసిందని తెలిపారు. వడగళ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నష్టాలను సర్వే చేయించి, తక్షణ నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పంట నష్టాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తలెత్తకముందే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. వ్యవసాయం మీద ఆధారపడే రైతన్నలను కాపాడాలంటే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో స్పందించి, నష్టపోయిన రైతులకు పంటల నష్టం ప్రకారం పరిహారం అందించాల్సి ఉందని, అందుకు వెంటనే ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మాజీ జడ్పిటిసి కుమార్ గౌడ్, ఆకుల సత్యనారాయణ, సూర్యనారాయణ, ఆంజనేయులుయాదవ్, ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఏ.కృష్ణ యాదవ్, ఆకుల బాబు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
Oplus_131072