సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్యారానగర్ డంపింగ్ యార్డు కారణంగా ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, వెంటనే పనులు నిలిపి వేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదలలో డంపుయార్డు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష 35వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జడ్పిహెచ్ఎస్ గుమ్మడిదల 2000-01 పదవ తరగతి విద్యార్థుల బ్యాచ్ నిరసన దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా బలవంతంగా డంపుయార్డు నిర్మాణం జరిపే ప్రయత్నం తగదని, ప్రభుత్వ విధానాలను పునఃసమీక్షించి, ప్రజల భావాలను గౌరవించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థులు, సంఘాలు ఈ దీక్షకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. డంపుయార్డు రద్దు చేసేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డంపుయార్డు పనులు వెంటనే నిలిపి వేయాలి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి
Published On: March 11, 2025 6:33 pm
