బి అర్ ఎస్ పర్యటన

నేడు మేడిగడ్డ ప్రాజెక్టుకు బిఆర్ఎస్ బృందం పర్యటన

ప్రశ్న ఆయుధం 25జులై
హైదరాబాద్:
తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నేడు మేడిగడ్డ పర్యటన కు వెళ్లనున్నారు..

గోదావరిలో ఉన్న నీటి ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జలాశయాలకు నీటిని మళ్లీంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ పర్యటన చేపడుతు న్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

నేడు బడ్జెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు బయలుదేర నున్నారు.

సాయంత్రం కరీంనగర్ లోని దిగువ మానేరు డ్యాంను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. రాత్రికి రామగుండంలో బస చేయనున్నారు.

మళ్లీ శుక్రవారం ఉదయం 10గంటలకు కన్నేపల్లి దగ్గర ఉన్న లక్ష్మీ పంప్ హౌస్ కు బీఆర్ఎస్ సభ్యులు వెళ్లి పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టును సందర్శిస్తారు.

మేడిగడ్డ ఆనకట్ట పరిస్థితి, అక్కడ ప్రవాహం, పంప్ హౌస్ దగ్గర నీటిమట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు వంటి పలు అంశాలను పరిశీలిస్తారు.

Join WhatsApp

Join Now