మహిళపై కిరాతకంగా అత్యాచారం 

మహిళపై కిరాతకంగా అత్యాచారం 

బీహార్‌ నిందితుడు రాహుల్‌ అడ్డంగా పట్టుబడ్డాడు

మహారాష్ట్రలోని గొండియాలో కామారెడ్డి పోలీసులు అరెస్ట్‌

 ఏడు బృందాలు సక్రమంగా అన్వేషణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్‌ 31

పాల్వంచ మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాహుల్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఎస్పీ వివరాల ప్రకారం, ఫరీద్‌పేట గ్రామానికి చెందిన మహిళ పత్తి చేనులో పని చేస్తున్న సమయంలో మణికంఠ రైస్ మిల్లులో పనిచేసే బీహార్‌కు చెందిన రాహుల్ వెనక నుంచి వచ్చి దాడి చేసి పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు విచారణ చేపట్టి, మిల్లులో పనిచేస్తున్న 40 మంది వివరాలను సేకరించారు. అందులో కొంతమంది అదృశ్యమవ్వడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

రాహుల్‌ తన కుటుంబంతో పంజాబ్‌కి వెళ్లిపోయాడని తెలుసుకున్న పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బీహార్‌, పంజాబ్‌, మహారాష్ట్ర రాష్ట్రాలకు పంపారు. చివరకు రాహుల్‌ మహారాష్ట్రలోని గొండియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎస్పీ తెలిపారు, రాహుల్‌ ముఖంపై శాలువా కప్పుకుని తిరుగుతూ పోలీసులకు దొరకకుండా ప్రయత్నించాడని, అయితే చాకచక్యంగా అతడిని పట్టుకున్నామని చెప్పారు. వలస కార్మికుల వివరాలు సేకరించేందుకు ప్రత్యేక ఫార్మాట్‌ రూపొందిస్తున్నామని, రాహుల్‌ పై గతంలో ఎలాంటి కేసులు లేవని వెల్లడించారు. అతని వద్ద నుండి ఒక గొలుసు, మొబైల్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment