Headlines
-
బుద్ధారం కాలువ నీళ్లు పొంగి పొర్లుతూ రైతులకు నష్టం
-
పంట పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల ఆందోళనలో రైతులు
-
జాడలేని నీటిపారుదల శాఖ – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతాంగం
-
సాగర్ నీటితో సతమతమవుతున్న పంటలు – ఎవరు బాధ్యత వహించాలి?
-
కాలువ నిర్వహణలో ఘోర లోపం – రైతుల బాధలు పీకెత్తుతున్నాయి
లబోదిబోమంటున్న రైతులు…?
*పంటలు కోతకొచ్చే… సాగర్ నీళ్లతో సతమతం అవుతున్న రైతులు…?
జాడ లేని నీటిపారుదల శాఖ అధికారులు..?
రెండు మూడు రోజులుగా ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోని వైనం…?
పంట పొలాలు తడిసి ముద్దవుతున్న.. పట్టించుకోకపోతే ఎలా..? అంటున్నా రైతులు..?
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల పరిధిలోని బుద్ధారం మేజర్ కాలువ నీళ్లు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో కాలువ ఆయకట్టు కింద సుమారు రెండు మూడు వందల ఎకరాలు తడిసి ముద్దవుతున్న గాని సంబంధిత అధికారులు పత్తా లేకపోవడం విశేషం. గత మూడు రోజులుగా ఫిర్యాదులు చేస్తున్న నీటిని అదుపు చేయకపోవడంతో సుమారు రెండు మూడు వందల ఎకరాలు నీటిలో మునిగి నానుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని బుద్ధారం రైతులు కోరుతున్నారు.