ఆర్మూర్ లో ప్రపంచ పండుగ బౌద్ధ దీపావళి

దీపావళి
Headline
ఆర్మూర్ లో ప్రపంచ పండుగ బౌద్ధ దీపావళి: జ్ఞానానికి వెలుగుల పండుగ

దీపం జ్ఞానానికి ప్రతీక. చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించడమే దీపం లక్ష్యం. దీపం అంటే అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన దీపం వెలిగించడమే. అది ముమ్మాటికీ గౌతమ బుద్ధుడు తన జీవితాంతం ప్రపంచ జనావళికి అందజేసిన గొప్ప సందేశం. ఆయన జ్ఞానోదయం పొందిన అనంతరం కపిలవస్తు నగరానికి తిరిగి వస్తున్న వేళల్లో అశేష దీపాలతో జనం స్వాగతించిన రోజే “బౌద్ధ దీపావళి” ప్రపంచ వ్యాప్తంగా పండుగ జరుపుకుంటారు. అదే గొప్ప సాంప్రదాయాన్ని తమ నిజమాబాద్ జిల్లాంతట జరుపుకోవాలని తమ 3సంఘాలు నిర్ణయించిన భాగంలోనే ఈ వేడుక అంటూ యశో బుద్ద ఫౌండేషన్ (వై.బి.ఎఫ్) ప్రముఖులు పబ్బ శంకర్ తెల్పారు. వై.బి.ఎఫ్, బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, అంబేడ్కర్ యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆర్మూర్ హౌసింగ్ బోర్డు లోగల పార్క్లో బౌద్ధ దీపావళి ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎ.వై.ఎస్ జిల్లా అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న, పింజ బోజన్న, జంగం అశోక్, వై.బి.ఎఫ్ నాయకులు మామిడి రవీందర్, భక్కురి రత్నయ్య, శాగంటి గంగాధర్, బి. హరీష్ మహారాజ్, పతాని సురేందర్, బి.ఎస్.ఐ ఆర్మూర్ కమిటీ వికాస్ పవార్, సచిన్ పవార్, ఆశిష్ కదం భయ్యా ఆదిత్య శిల్ప కార్ కవిత శిల్పా మాయ వర్ష ప్రమిత మన్ను, డి.ఎస్.పి మోర్తాడ్ నేత ఉమేష్ మహారాజ్, అంగుళి మాలజీ, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు

Join WhatsApp

Join Now