ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మించండి
– అభయ జ్యోతి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు లత
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 31 వ వార్డు, ఇస్లాంపూరలో భవాని రోడ్లో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న స్థలంలో పల్లె ప్రకృతి వనం, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని అభయ జ్యోతి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నంగునూరు లత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ 31 వ వార్డులో గతంలో మునిసిపల్ కార్మికులు ఉండేందుకు ఇక్కడ గృహలు నిర్మించారాని, అందులో ఎవరు లేకపోవడంతో ఆ తర్వాత ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రాథమిక పాఠశాల నిర్మించి విద్యా బోధన చేసే వారని ప్రస్తుతం అది కూడా నడవడం లేదని, ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఆ భవనాన్ని తొలగించి ఆ స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వార్డు ప్రజలు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గతంలో ప్రజావాణిలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేశానని ఇప్పటికైనా కలెక్టర్ దృష్టి సారించి ఆ స్థలాన్ని ఉపయోగం లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.