బోరబండ బస్టాండ్ లోని అమ్మవారిని దర్శించుకున్న బండి రమేష్ అలానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

IMG 20250720 WA0630

బోరబండ బస్టాండ్ లోని అమ్మవారిని దర్శించుకున్న
బండి రమేష్ అలానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రశ్న ఆయుధం జులై20: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణలో తొలి పండుగ పెద్ద పండుగ బోనాలు ఆదివారం అమ్మవారి ఆలయాలన్నీ బోనాల ఉత్సవాలతో భక్తులతో కిటకిటలాడాయి టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి బోరబండ బస్టాండ్ లోని అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా రమేష్ పేర్కొన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా మూసాపేట కూకట్పల్లి ,కెపిహెచ్బి ,కాలనీ ప్రగతి నగర్ యాదవ బస్తి ముస్కిపేట్ బాలానగర్ ప్రాంతాల్లోని అన్ని అమ్మవారి ఆలయాలను అయన స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. జేఎన్టీయూ రోడ్ లోని లులు మాల్ దగ్గరలో ఉన్న పోచమ్మ ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. బోనాల సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో పూలమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment