నామినేటెడ్ పోస్టుల జాబితాను మీనాక్షి నటరాజన్ కు అందజేసిన బండి రమేష్
ప్రశ్న ఆయుధం జులై29: కూకట్‌పల్లి ప్రతినిధి
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించి గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలో ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది.పార్టీ నామినేటెడ్ పోస్టులు వివిధ కార్పొరేషన్ చైర్మన్ లతో కూడిన జాబితాను జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ సిద్ధం చేశారు. గాంధీభవన్లో ఎ సి సి పరిశీలకురాలు రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్ ల సమక్షంలో జరిగిన సమావేశంలో బండి రమేష్ ఈ జాబితాను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా మరియు ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.