బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన బండి రమేష్ 

బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన బండి రమేష్

ప్రశ్న ఆయుధం జులై06: కూకట్‌పల్లి ప్రతినిధి

దేశ ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రామ్ పేద ప్రజలకు చేసిన సేవలు కొనియాడదగ్గవని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. 38వ వర్ధంతి సందర్భంగా ఆదివారం బాలానగర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి దేశ అత్యున్నత స్థాయికి ఎదిగిన జగజీవన్ రామ్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, శ్రీకాంత్ పటేల్, శివకుమార్ గౌడ్, మధు గౌడ్, యుగేందర్ ,ప్రసన్న కుమార్, రామ్మోహన్ రావు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now