ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు ఘన నివాళులర్పించిన….బండి రమేష్
ప్రశ్న ఆయుధం ఆగస్టు 06: కూకట్‌పల్లి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం మూసాపేట్ లోని ఆయన విగ్రహానికి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ భావజాలవ్యాప్తికి తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ ని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రథసారథిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాక పోరాడిన మహా వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, తూము మనోజ్, శివ చౌదరి, హరిప్రసాద్ ,రమణ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.