ఇఫ్తార్ విందు కార్యక్రమం లో పాల్గొన్న బండి రమేష్
ప్రశ్న ఆయుధం మార్చి 25: కూకట్‌పల్లి ప్రతినిధి
కాంగ్రెస్ నాయకుడు గిరిధర్ ఆధ్వర్యంలో రామారావు నగర్ లో మంగళవారం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి కార్యక్రమాలు హిందూ ముస్లిం సోదరుల మధ్య నెలకొన్న ఐక్యతను తెలియజేస్తుందన్నారు.