Site icon PRASHNA AYUDHAM

సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు అందజేసిన బండి రమేష్ 

IMG 20250503 WA2175

బేగంపేట ప్రకాష్ నగర్ లో

సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు అందజేసిన బండి రమేష్

ప్రశ్న ఆయుధం మే03: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా పేద మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని అమలు చేస్తున్నదేనని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కోట్ల మందికి సన్న బియ్యం అందించడం గొప్ప సాహసోపేత నిర్ణయం అని కొనియాడారు. నియోజకవర్గ పరిధిలోని బేగంపేట ప్రకాష్ నగర్ లో శనివారం విశాల్ సుదం కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో రమేష్ సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని జోడు గుర్రాల్లా భావిస్తూ ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు దగ్గర్నుంచి కులగణన చేపట్టడం వరకు రేవంత్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, టోచర్ ,నర్సింగ్ రావు ,అరుణ్, పర్వేజ్ ,మోయిజ్, కరుణాకర్, బాల తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version