ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోఇజ్ ను
పరామర్శించిన…బండి రమేష్
ప్రశ్న ఆయుధం జులై21: కూకట్‌పల్లి ప్రతినిధి
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కూకట్పల్లి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్యకర్త మోఇజ్ ను టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సోమవారం స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, తూము సంతోష్, సలీం, శివ చౌదరి, బాలరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.