గద్దర్ ను అవమానపరిచిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి

గద్దర్ ను అవమానపరిచిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి

* పద్మశ్రీ గద్దర్ లాంటివారికిస్తే పద్మశ్రీకే ఔన్నత్యం పెరుగుతుంది.

* డిబిఎఫ్ రాష్ట్రకార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు

*గజ్వేల్ , జనవరి 27,

పేదల, అణగారిన, అట్టడుగు, ఊరికి దూరంగా వెలివాడుల బతుకుల బాగుకోసం కొట్లాడిన ఉద్యమ సూర్యుడు గద్దర్ ను అవమానపరిచిన బండి సంజయ్ వెంటనే క్షమాపణచెప్పాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణులు డిమాండ్ చేశారు. సోమవారం వారు గజ్వేల్ లో విలేకరులతో మాట్లాడుతూ గద్దర్ ప్రజా ఉద్యమాలకు, సాహిత్య ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమానికి వెన్నుముఖ అని, గద్దర్ కు మీరు ఇచ్చిన, ఇయ్యకపోయిన ఆయన ఎప్పుడో పద్మశ్రీ, పద్మ విభూషన్ కంటే ఎక్కువ పేదల గౌరవాన్ని పొంది లక్షలాది బడుగుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి, శక్తి గద్దర్ అని కొనియాడారు. అటువంటి పేదల బతుకుల చిత్రాలను మార్పుకొసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప ప్రజల నాయకుడు, గద్దర్ గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదన్నారు. మీరు పుట్టి నడవకముందే ఎల్లలు దాటి ప్రపంచవేధికలపై గద్దర్ గళమెత్తిండని, గద్దర్ తెలంగాణ కోసం, మట్టి మనుశుల బతుకుల బాగుకోసం కాలికి గజ్జెకట్టి అమ్మా తెలంగాణామా, ఆకలి కేకల గానమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణామా అంటూ వేలాది పాటలతో ఊరు వాడను ఉద్యమం వైపు కదిలించిన మహనుబావుడు గద్దర్ అన్నారు. పద్మశ్రీని గద్దరుకు అర్హతలేదనుడు కాదు, గద్దర్ లాంటి ఉద్యమాల గుండెకాయకు పద్మశ్రీ ఇస్తే పద్మశ్రీకే ఔనత్యం పెరుగుతుందన్నారు. గద్దర్ పంచశీల పట్టుకొని బాబాసాహెబ్ బాటలో నడిచిన వ్యక్తని, నిన్న నిండు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని, నేడు బండి సంజయ్ గద్దర్ ను అవమానించారు అంటే బీజేపీ పార్టీ అంటే ప్రజల బతుకుల మార్పుకోసం పనిచేసిన, హక్కులను కల్పించిన మహనుబావులను అవమానపర్చడమేనా అని ప్రశ్నించారు. బీజేపీ అంటే దళిత, గిరిజన, అదివాసుల వ్యతిరేకిగా 750 మందికి పైగా రైతు ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న మార్టీగా బీజేపీ మారిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే, దేశం రాష్ట్రం మొత్తాన పెద్ద ఉద్యమం కదులుతుందని ఏన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, కనుకయ్య పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now