మంచిర్యాల: తాళం వేసిన ఇంట్లో చోరీ
Nov 26, 2024,
మంచిర్యాల: తాళం వేసిన ఇంట్లో చోరీ
మంచిర్యాల పట్టణంలోని 33వ వార్డు చింతపండు వాడలోని చెట్ల దిలీప్ కుమార్ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. దిలీప్ కుమార్, సంధ్యారాణి దంపతులు ఈనెల 20న గుజరాత్ లోని ద్వారకకు వెళ్లారు. సోమవారం ఇంటికి ముందు సీసీ కెమెరాలు కిందపడి తలుపు తాళం తీసి ఉండడాన్ని గమనించిన పక్కింటి రాజకుమార్ డయల్ 100 సమాచారం అందించాడు. తులం నర బంగారం ఎత్తుకెళ్లారని ఎస్సై తెలిపారు.