*హత్యయత్నం చేసి హత్య చేసిన దుండగుల దిష్టిబొమ్మ దగ్ధం*
*యువ డాక్టర్ పై హత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి*
*ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి*
కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 18
కోల్కతాలో ఆర్ జి కె ఆర్ మెడికల్ కళాశాలలో యువ డాక్టర్ పై హత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ స్థానిక తెలంగాణ చౌక్ వద్ద అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ దుండగుల దిష్టిబొమ్మను చెప్పు చీపుర్లతో కొడుతూ దగ్ధం చేశారు అనంతరం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ కోల్కత్తాలో యువ డాక్టర్ పై హత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను తక్షణమే కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు జాగ్రత్తగా వహించాలని అన్నారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడిగా పర్యటనలు చేసి ఓదార్పు చేసి చేతులు దులుపుకుంటున్నారని కఠినాతి కఠినమైన శిక్షలు రావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
ఒక మెడికల్ కళాశాలలోనే ఇటువంటి సంఘటనలు జరిగితే సామాన్యులకు బయట తిరిగే మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు బేటి బచావో బేటి పడావో అనేది ప్రచార నినాదం వరకే మిగిలిపోతుందని కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని అన్నారు రోజు రోజుకు దేశంలో మహిళల పట్ల హత్యలు అత్యాచారాలు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అరికట్టవలసిన కేంద్ర హోంశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తే మరొకరు తప్పు చేయాలి అని ఆలోచన వస్తేనే భయపడే విధంగా కఠినంగా శిక్షలు ఉండాలని కోరారు
దేశంలో మహిళలకు భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో మహిళలపై అగత్యాలు హత్యాచారాలు జరగకుండా జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
మహిళలపై అగత్యాలు జరగడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా పోర్న్ వెబ్సైట్లు గంజాయి మద్యం ఏరులై పారడం మహిళలని కార్పోరేట్ శక్తులు సరుకుగా చూపిస్తూ మహిళల విలువలను దిగజారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై అఘాయిత్యాలను అరికట్టవలసిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ మహిళల పట్ల వివక్షత కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు చైతన్యంతో ధైర్యంతో ముందుకు సాగాలని అన్నిటిని ఎదిరించే శక్తి మంత్రులుగా ఎదగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకొచ్చి వెంటనే అమలు పరిచి మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వాజ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ద్యావా అన్నపూర్ణ గుడికందుల సంధ్య సహాయ కార్యదర్శులు సి.హెచ్ రోజా రాణి మంచినీళ్ల లావణ్య ఎడ్ల రజిత నాయకురాలు స్వర్ణలత జి.స్పందన జి.సింధు యం.స్ఫూర్తి తదితరులు పాల్గొన్నారు