*బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన…*
*సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు*
ప్రశ్న ఆయుధం 01 ఆగష్టు(బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జుబెర్ మాట్లాడుతూ…మహిళలపై సీఎం, డిప్యూటీ సీఎంలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది ఎందుకు కాదన్నారు.అందరి ఇళ్లలో ఆడబిడ్డలు ఉంటారని,ఆలోచించకుండా అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన మహిళలు, ప్రజా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు జుబెర్ తో పాటు వైస్ చైర్మన్ షేక్ జూబేర్ , శివ సూరి,రమేష్ ,గౌస్ ,ఆటో మౌలా,చాకలి సాయిలు,నాగరాజు,మహిళలు తదితరులు.