సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
రాష్ట్ర బడ్జెట్ లో ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశ పెట్టకపోవడం సిగ్గుచేటు
ప్రశ్న ఆయుధం 26 జూలై(బాన్సువాడ ప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల కొరకు నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ పథకాల కొరకు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలను విస్మరించడంతో రాష్ట్రంలో మొన్న ఎలక్షన్ లో టిఆర్ఎస్ కు గద్దె దించడం జరిగింది అన్నారు.రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది.ఈరోజు ముఖ్యమంత్రిగా గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి, మీ మేనిఫెస్టోను అమలు చేయాలని మన రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులు ఎందుకు బిజెపి డిమాండ్ మీరు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అమలు చేయకపోతే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే ఈ ఉమ్మడి జిల్లాలో మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారని బిజెపి ప్రశ్నించింది.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్,జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్,ఓబిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మక్కన్న జిల్లా అధికార ప్రతినిధి హనుమాండ్లు,మండల అధ్యక్షులు సాయికిరణ్,సాయిబాబా,పట్టణ ప్రధాన కార్యదర్శి పాశం భాస్కర్ రెడ్డి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు హనుమాన్లు,కిషన్ మోర్చా మండల అధ్యక్షులు గంగారం,బిజెపి నాయకులు కొనాల గంగారెడ్డి,సాయికిరణ్ సాయి రెడ్డి ఆంజనేయులు దత్తు చిరంజీవి యోగి బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.