వరి కొయ్యలను కాల్చడం వల్ల పంట భూమి పర్యావరణంపై చెడు ప్రభావం పడుతుంది

వరి కొయ్యలను కాల్చడం వల్ల పంట భూమి పర్యావరణంపై చెడు ప్రభావం పడుతుంది

మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ వెల్లడి 

వానాకాలం వరి కోతలు చివరి దశలో ఉండడం, యాసంగి లో పంటలు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్న రైతులు ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంట భూమిలో వరి కొయ్యలను కాల్చడం ద్వారా, పంట భూమి బలహీనపడి, పర్యావరణం తో పాటు చెడు ప్రభావం పడి, యాసంగిలో సాగు చేసే పంటలకు, తెగుళ్లు సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని, దిగుబడి కూడా తగ్గుతుందని,రైతులు వరి కొయ్యలను ఎట్టి పరిస్థితుల్లోసాగు చేసే పంట భూమిలో కాల్చవద్దని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ రైతులకు ఒక ప్రకటనలో తెలిపారు .వరి కొయ్యలను కాల్చడం ద్వారాపంట భూమిలో గల విలువైన పోషకాలు ఆవిరైపోతాయని, నేల మట్టి తేమను పట్టుకొని ఉండే గుణం తగ్గిపోతుందని, ఇలాంటి పలు నష్టాలు ఎన్నో ఉన్నాయని రైతులకు వ్యవసాయ అధికారి సూచించారు. ప్రత్యామ్నంగా వరి కొయ్యలను ఎస్ ఎస్ పి లాంటి ఎరువులను వాడి, కుళ్లిపోయేలా చేసినట్లయితే భూసారం పెరిగి, వచ్చే యాసంగి పంటలు అధిక దిగుబడులు పొందుతారని రైతులకు వివరించారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే, ఆయా గ్రామాల విస్తీర్ణ అధికారులను గాని,మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారిని గాని రైతులు సంప్రదించి పంటల సాగు పద్ధతులపై సలహాలు, సూచనలు, తీసుకోవాలని వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ రైతులను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment