చెవిలో పేలిన ఇయర్ బడ్స్ యవతికి శాశ్వత వినికిడి లోపం
టర్కీలో శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలడంతో యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తింది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో పేలిందని యువతి ప్రియుడు తెలిపారు. దీనిపై శాంసంగ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడుకు గల కారణాన్ని వెల్లడించలేదన్నారు. దీంతో సేఫ్టీ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.