స్త్రీ వేషధారణలో ఉన్న నలుగురు పురుషులకు వ్యాపార సముదాయాలు,

IMG 20240927 WA0114

సికింద్రాబాద్ కార్ఖానా పోలీసులు నాలుగు మంది పురుషులు మరియు ముగ్గురు ట్రాన్స్ జెండర్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరు స్త్రీ వేషధారణలో భిక్షాటన పేరుతో డబ్బులు వసూలు చేయడంలో పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటన మాయాబజార్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది, అక్కడ డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.విచారణలో సూరద చాందిని, జయశ్రీ, మనీషాలు లింగమార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుని ట్రాన్స్ జెండర్‌లుగా మారినట్లు తెలిసింది. వీరు స్త్రీ వేషధారణలో ఉన్న నలుగురు పురుషులకు వ్యాపార సముదాయాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పాదచారులు, వాహనదారులు మరియు వ్యాపారస్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. భిక్షాటన లేదా వసూళ్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులపై శ్రద్ధ వహించాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.పోలీసులు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు..

Join WhatsApp

Join Now