కామారెడ్డి జిల్లాలో సరికొత్త హంగులతో వ్యాపారం

కామారెడ్డి జిల్లాలో సరికొత్త హంగులతో వ్యాపారం

– నూతన అధ్యాయం స్వర్ణ  – డైరెక్టర్ పి.రమేష్ బాబు

కామారెడ్డి జిల్లాలో నూతన వ్యాపారం అందుబాటులోకి వచ్చిందని స్వర్ణ ఎంక్లేవ్ ను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు డైరెక్టర్ రమేష్ బాబు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నూతనంగా స్వర్ణ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు.

రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఉరవడిలో కామారెడ్డి పట్టణ శివారులో లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో స్వర్ణ ఎంక్లేవ్ వెంచర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రియల్ ఎస్టేట్ ప్రముఖ వ్యాపారవేత్తలు కామారెడ్డి జిల్లా క్రె డా అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ నర్సా గౌడ్, ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా వెంచర్ డైరెక్టర్ పి.రమేష్ బాబు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో ఈ వెంచర్ ప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకే ఈ ప్లాట్ లను లేఔట్ చేయడం జరిగింది అన్ని అనుమతులతో వెంచర్ను ప్రారంభించడం జరిగిందని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని వసతులతో వెంచర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. దీంట్లో ప్రత్యేకంగా 30 ఫీట్ల బీటీ రోడ్డు తో పాటు 100% వాస్తు యోగ చేసుకోవడానికి సకల సదుపాయాలతో రెవెన్యూ ప్లాంటేషన్ పంచవటి పార్క్,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓపెన్ జిమ్, విద్యుత్తు లైట్లతోపాటు అవుట్డోర్ బ్యాడ్మింటన్ కోర్ట్,ఫుట్పాత్,తో ప్రత్యేక ఆకర్షణగా తదితర వసతులతో లేఅవుట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వచ్చే నెల ఆగస్టు 4 నుండి బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వసుంధర బిల్డెక్స్ డైరెక్టర్స్ రిషి అగర్వాల్,వరుణ్ అగర్వాల్, సీతా దేవి, సందీప్,మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment