Site icon PRASHNA AYUDHAM

సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి…బివిఏం రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ 

IMG 20241231 WA0020

సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి…

– భారతీయ విద్యార్థి మోర్చ బివిఏం రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విట్టల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు గత కొన్ని రోజులుగా వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్నారు. వీరూ సమ్మెలో ఉండడం వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని అన్నారు.గత ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా వారిని మభ్యపెడుతూ వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలలో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని, ఉద్యోగ భరోసా కల్పిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాను స్వయంగా వారితో మాట్లాడి మీ సమస్యలను మా ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించి ప్రభుత్వం నుంచి అచ్చే బెనిఫిట్ అని అందిస్తామని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం గడిచింది కానీ వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా వారితో సంప్రదింపులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు సమ్మెలో ఉండడం వల్ల కేజీబీవి లో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్నారు. విద్యాశాఖ కార్యాలయాలలో ఆపరేటర్స్ లేకపోవడం వల్ల మూసివేస్తున్నారు. విద్యార్థులు జీవితాలతో చెలగాటమడితే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరి సమస్యలను పరిష్కరించి వారిని న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో విద్యాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రావణ్ ,అజయ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version