రాష్ట్రంలో ఒకే రోజు కులగనన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు అసెంబ్లీలో క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షదాయకం
* మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి
* గజ్వేల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం
*గజ్వేల్ , ఫిబ్రవరి 05,
తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు కులగణన, ఎస్సీ వర్గీకరణపై నివేదికలకు అసెంబ్లీలో క్యాబినెట్ ఆమోదముద్ర తెలపడం హర్షదాయకమని, రాష్ట్ర చరిత్రలో చరిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో గత 30 ఏళ్ల నుండి సుధీర్గంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలపడం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అని, మాట నిలుపుకునే ప్రభుత్వమని నర్సారెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి దళితుల ఓట్లు సంపాదించారు తప్ప దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు. కులగన ద్వారా రాజకీయంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, ప్రతిపక్ష పార్టీలకు దమ్ముంటే బీసీలను రాజకీయంగా స్థానం కల్పించాలని, బీజేపీకి దమ్ము ధైర్యం ఉంటే దేశవ్యాప్తంగా కులాలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బిఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీ జపం చేస్తున్న కేటీఆర్ బీసీ గనణలలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. అన్ని రంగాలలో వెనుకబడిన బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ బడ్జెట్లో మొండి చేయి చూపించిందని, రాష్ట్రంపై వివక్షతను చూపుతున్న ప్రధాని మోడీ పద్ధతి మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజలను ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా తప్పుదోవ పట్టించినా అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరని, కెసిఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి అనుకూలంగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అక్షారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పార్టీ సీనియర్ నాయకులు జంగం రమేష్ గౌడ్, ఊడేం శ్రీనివాసరెడ్డి, కుమార్, సమీర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.