Site icon PRASHNA AYUDHAM

వైకాపా పాలనలో ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌ నివేదిక

వైకాపా పాలనలో ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌ నివేదిక

అమరావతి: వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్‌ నివేదిక బయటపెట్టింది. 2023-24లో రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది..రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని కాగ్‌ వెల్లడించింది. స్థానిక సంస్థలకు రూపాయిలో 9 పైసలే చెల్లించారని తెలిపింది. మూలధన వ్యయంగా 9 పైసలే ఖర్చు చేశారని నివేదికలో పేర్కొంది..చెల్లించిన అప్పు రూపాయిలో 7 పైసలే ఉంది. 2023-24లో రాష్ట్ర సొంతపన్ను ఆదాయం రూ.922 కోట్లు. శాసనసభ అనుమతి లేకుండా విద్యాశాఖలో రూ.249 కోట్లు ఖర్చు చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ వద్ద రాష్ట్ర నిల్వ రూ.19కోట్లు లోటు ఉంది” అని కాగ్‌ నివేదికలో వెల్లడించింది..

Exit mobile version