తాండూర్: పులి దాడిలో లేగ దూడ హతం
Dec 25, 2024
పులి దాడి చేసి లేగ దూడను హతమార్చిందన్న వార్త మంగళవారం పలు ప్రసార మాధ్యమాల్లో రావడంతో స్థానికుల్లో భయాందోళనకు మొదలైంది. తాండూరు మండలంలోని నీలాయపల్లికి చెందిన యువకులు సాయి, శంకర్ రేపల్లెవాడ శివారులోని పంటచేలలో పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా రక్తపు మడుగులో పడి ఉన్న లేగ దూడను చూసి భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు విషయం తెలియజేయడంతో గ్రామంలో విచారణ చేపట్టారు.