గ్రామాల్లో సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చు
—-ఎస్సై టి. మురళి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి,
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 9
గ్రామాల్లో సీసీ కెమెరాలతో నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని తాడ్వాయి ఎస్సై మురళి చెప్పారు. మంగళవారం మండలంలోని కరడ్‌పల్లి, గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, “ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం. ప్రతి గ్రామంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలపై కట్టడి సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సాయిబాబా, వంశీ, నిరంజన్, లక్ష్మి, నర్సింలు, గ్రామస్తులు గొల్ల రాములు, మర్రి సాయి రెడ్డి, మామిడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.