గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేయాలి.
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,
వరంగల్ జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 22
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి విక్రయాలు, సేవించడం ఉక్కుపాదంతో అణివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్వర్యంలో అర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని సొమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పెండింగ్ లో వున్న ప్రధాన కేసుల దర్యాప్తు వాటి పురోగతి, కేసుల్లోని నిందితుల అరెస్టులో ఆలస్యం అవ్వడంలో గల ప్రధాన కారణాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ వారిగా పోలీస్ అధికారులతో సమీక్షా జరిపారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ అధికారులకు పలుసూచనలు, సలహాలను అందజేస్తూ కేసుల దర్యాప్తులో విషయంలో అధికారులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్దతిను కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలని, అలాగే కేసు నమోదయిన వారంరోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని స్టేషన్ అధికారులు ప్రతి రోజు ఒక గంట పాటు పెండింగ్ కేసులను సమీక్షా జరపాలని, దర్యాప్తులో వున్న కేసుల్లో బాధితులకు వీలైనంత వరకు న్యాయం చేయాలని, పోలీస్ అధికారుల పనితీరుపైనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ కీర్తి ప్రతిష్టలు అధారపడి వుంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం శాంతి భద్రతల అంశాలపై పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై నిరంతరం నిఘా వుండాలని, బాలికలు, మహిళల మిస్సింగ్, అపరహణ కేసుల్లో అలసత్వం వహించకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని, గతంలో నమోదైన గంజాయి కేసుల్లో తప్పించుకొని తిరుగుతున్న నిందితులను పట్టుకోనేందుకుగాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, కమిషనరేట్ పరిధిలో నిరంతరం కార్డన్ సెర్చ్ తనీఖీలు నిర్వహించాలని, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సెప్టీ విభాగంతో కల్సి పనిచేయాలని ముఖ్యంగా రొడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని, ప్రధానంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు తనీఖీలు చేపట్టాలని, అలాగే ట్రిపుల్ సి విభాగం నుండి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకొవడం జరిగిందనే దానిపై ఎప్పటికప్పుడు అధికారులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ సమావేశంలో డిసిపిలు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అదనపు డిసిపిలు రవి, సంజీవ్,సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.