పదేళ్లలో ఒక్క శిక్షణా తరగతి నిర్వహించలే

  • పదేళ్లలో ఒక్క శిక్షణా తరగతి నిర్వహించలే.. ఇప్పుడు నిర్వహిస్తే అడ్డుకోవడమేమిటి
  • ప్రెస్ అకాడమీ యూనియన్లకు కాదు.. జర్నలిస్టుల కోసం పనిచేస్తుంది
  • ఏ యూనియన్ అయినా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ముందుకు వస్తే తాము సిద్ధంగా ఉన్నాము
  • పేర్లు నమోదు చేసుకోవాలని రెండు నెలల ముందే చెప్పాము
  • వెనకబడుతున్న జర్నలిజం ను సోషల్ మీడియాతో పోటీపడే విధంగా చేయాలన్నదే లక్ష్యం
  • యూనియన్లు నైతిక నియమావళిని పాటించాల్సిన అవసరం ఉంది
  • తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి

 

పదేళ్ల కాలంలో పదవిలో ఉండి ఏనాడు కూడా జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించలేదు.. కానీ నేడు పడిపోతున్న జర్నలిస్టుల విలువలను కాపాడాలని లక్ష్యంతో జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం ఏమిటని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ మీడియా అకాడమీ యూనియన్లకు అతీతంగా పనిచేస్తుందని, జర్నలిస్టులకు ఏ సమస్యలు వచ్చిన ధైర్యంగా వచ్చి విన్నవించుకోవచ్చు కానీ సంఘాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని గత రెండు నెలల క్రితమే ప్రకటించడం జరిగిందని.. శిక్షణ తరగతులకు వచ్చే జర్నలిస్టులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని తెలిపామని కానీ వాటిని జర్నలిస్టులు పెడచెవిన పెట్టి ఈరోజు శిక్షణ తరగతులను అడ్డుకునేందుకు యత్నించడం సరికాదని సూచించారు. తెలంగాణ మీడియా అకాడమీ నుండే కాకుండా రంగారెడ్డి జిల్లా డిపిఆర్ఓ ద్వారా పదేపదే చెప్పించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే సహకారంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో వారు విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో ఏనాడు కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలని మరి ఎందుకు చెప్ప లేదు.. నేడు నిర్వహిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతుంది. వెనుకబడుతున్న జర్నలిజం సోషల్ మీడియాతో పోటీపడే విధంగా చేయాలన్నదే మీడియా అకాడమీ లక్ష్యమని పేర్కొన్నారు. యూనియన్లు ఏవైనా ఉండొచ్చు కానీ నైతిక నియమావళిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రెస్ అకాడమీ యూనియన్ల కోసం కాదు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. శిక్షణ తరగతులు అంటే వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.. ఒక తరగతి గదిలో నిర్ణీత విద్యార్థులు ఉంటే ఆ టీచర్ అంత ఉత్సాహంతో పాఠ్యాంశాలను బోధించేందుకు అవకాశం ఉంటుంది.. ఇక్కడ కూడా పరిమితి సంఖ్యకు అనుగుణంగానే జర్నలిస్టులను శిక్షణ తరగతులకు తీసుకోవడం జరిగింది కాబట్టే దాని ప్రకారం ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. కానీ ఇది తెలియక కొంతమంది తమకేదో నష్టం జరిగిందని ఊహించుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే నష్టపోయేది వారే. ఏ యూనియన్ అయినా సరే తమకేమీ అభ్యంతరం లేదు.. ఎప్పుడు ఎక్కడ శిక్షణా తరగతులు నిర్వహించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ సిద్ధంగా ఉంటుందని చైర్మన్ తెలిపారు.

 

శిక్షణ తరగతుల్లో మొదటిరోజు

 

జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో రంగారెడ్డి జిల్లా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజులపాటు శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తల సేకరణలో సామాజిక ప్రభావం వంటి అంశాలు పూర్తిగా కొత్త రూపం దాల్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా రంగం సాంకేతికతతో వేగంగా వార్తల సేకరణ సులభం అవుతుంది తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్తు – మీడియా ధోరణులు, ఆధునిక యుగంలో మీడియాలో వస్తున్న మార్పుల గురించి వివరించారు. సోషల్ మీడియా యూట్యూబ్ లో వస్తున్న వార్తలు క్షణాల్లో ప్రజల్లో వెళ్తున్నాయని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, ఫ్యాక్టు చెక్, మొదలగునవి టెక్నికల్ గా ఏలా ఉపయోగించాలో జర్నలిస్టులకు సవివరంగా తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ, నేర వార్తల సేకరణ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన ఉండాలని, వార్తలు సేకరించే ముందు నిజనిర్ధారణ చేసుకొని చేసుకుని వ్రాయాలని ఆయన సూచించారు, అలాగే నేర వార్తలు లలో చేయాల్సినవి చేయకూడనివి అంశాలపై క్లుప్తంగా వివరించారు. సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం- 2005 గురించి సమగ్రంగా వివరించి జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు,ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి,టీయూడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా,కార్యదర్శి మేకల సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా డిపిఆర్ఓ పి.సి. వెంకటేశం, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment