సిద్దిపేట సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం :
సిద్ధిని, బుద్ధుని, ప్రసాదించే వరసిద్ధి వినాయకుడు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడలేడా? ఒకప్పుడు గ్రామాల్లో ఒగ్గు కథలు, హరికథలు ,పురాణ ఇతిహాసాలతో ,వెలసిల్లిన గ్రామ సీమలో ఇప్పుడు విష సంస్కృతిని విచ్చలవిడిగా వచ్చి చేరింది. పాశ్చాత్య నాగరికత విశ్రంకాలుగా విలయ తాండం చేస్తుంది. పరాయి పాలనలో పోగొట్టుకున్న సంస్కృతిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు నడుస్తున్నప్పటికీ ఏది కూడా విజయవంతం అయ్యే పరిస్థితుల్లో నేడు మనం లేకున్నాం. ఒకపక్క అన్యమతస్తులు మనమీద విషం చిమ్ముతున్న ,మనం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాం. ఒక పక్క దేశం దాయాదుల దాడుల పోరు కోసం వేచి చూస్తుంటే మనకేం పట్టనట్లుగా మనం ఉంటున్నాం. ఇలాంటి సమయంలో మనం వినాయక వ్రతకల్పాన్ని మన శత్రువు కు అందనంత ఎత్తుకు ఎదగడానికి వాడుకోవాలని నా విన్నపం. హిందూ ధర్మాన్ని విస్తరింప చేయడానికి, విష సంస్కృతిని ప్రారదులడానికి వినాయక మండపాలు సామాజిక బాధ్యత కేంద్రాలుగా ఎందుకు తీర్చిదిద్ద బడడం లేదు. దీనికి కారణం మనకు మనమే. ధర్మానికి హాని జరుగుతుందని, సంస్కృతి చెడిపోతుందని పెడబొబ్బలు పెట్టే మనం, ఇంత మంచి అవకాశాన్ని వినాయక మండపాల వద్ద మన ధర్మం కోసం మన మతం కోసం ఎందుకు మాట్లాడుకోకూడదు. ఒకసారి ఆలోచించండి. హిందూ ధర్మంలో భాగంగానే వినాయక చవితి నవరాత్రులను జరుపుకుంటున్నట్లయితే, ఇన్ని మండపాలలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ఇంతకంటే గొప్ప పండుగ మరొకటి లేదేమో అనిపిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన ఇలాంటి వాతావరణం గ్రామాలలో ఎక్కడ కనిపించదు స్వతంత్రంగా మనకు మనమే ఇంత పెద్ద కార్యక్రమాన్ని వేద పండితుల పిలుచుకొని తమ తమ కార్యకలాపాలను చక్కగా నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ పండుగ అనేది ఒక తంతులాగా ఎందుకు జరుగుతుంది. భగవంతుడు వరాలు ఇచ్చేది వాస్తవమే, అయినప్పటికీ ఇలాంటి కష్ట సమయాల్లో హిందూ ధర్మం కోసం అనేకమంది పాటుపడుతున్న ఏక తాటిపైకి రానీ జనం కనీసం ఈ పండుగ కోసమైనా ఒక దగ్గర చేరి తమ తమ భక్తీ ప్రవృత్తులను చాటుకుంటున్నారు. ఇలాంటి శుభ తరుణంలో మన హిందూ ధర్మంలో రోజురోజుకు సన్నగిల్లుతున్న సంస్కృతిని కాపాడడానికి ఈ వినాయక మండపాలను ఎందుకు వాడుకోకూడదు అనేదే నా సందేహం? కుల మత వర్గ పోరుతో సతమతమవుతున్న నేటి తరుణంలో దేశానికి వెన్నుదండిగా ఉండాల్సిన పరిస్థితుల్లో మనమంతా ఏకతాటిపైకి వచ్చి గ్రామాల్లో యువతను చైతన్యపరిచి. దేశం కోసం ఆనాడు స్వతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ చూపెట్టిన ఆత్మఫైర్యాన్ని నింపి జాతిని స్వతంత్ర పోరాటం వైపు మళ్ళించడానికి వినాయక మండపాలను ఒక వేదికలాగా వాడుకున్న ఆ మహనీయుని అడుగుజాడలో నేడు మన పురోహితులు . స్వామీజీలు సంతు జనులు నడవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎంతో మధురకంఠంతో వేదమంత్రచరణ చేస్తుంటే గ్రామాలన్నీ పులకరించి పోతున్నాయి. అలాంటి నోటి ద్వారానే ఇప్పుడు దేశం యొక్క పరిస్థితి బట్టి వైజ్ఞానికంగా కొంచెం ఆలోచించి గ్రామాలలో యువతకు మార్గదర్శకం చేస్తారని చిన్న మనవి. దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. అయినప్పటికీ మనకి ఏమీ పట్టనట్లుగా వివరిస్తే ఏమి లాభం. ప్రతి గ్రామంలో ఎవరికి వారే వారి వారి కులాల వారీగాను లేదా మరో రకంగాను ఇంతటి మహోన్నత కార్యక్రమాలు స్నేహితులతో కలిసి నడిపిస్తున్నారు మీరంతా నిజానికి ధార్మిక సంపత్తి కలిగిన మహనీయులు గానే భావిస్తున్నాను. అయినప్పటికీ వీటిని మనం ధర్మకార్యంగా విజ్ఞాన వేదికగా మార్చుకొని మనం ఏం కోల్పోతున్నామో తెలియజేయాల్సిన బాధ్యత పురోహితులపై ఉందని నా గట్టి విశ్వాసం. దేశం కోసం, ధర్మం కోసం, కర్తవ్య బోధ చేసినట్లయితే కొంతలో, కొంతైనా, మెరుగుపడుతుందేమో దేశం. పరిస్థితులు ఒక్కొక్క మండపం వద్ద ఎన్ని గంటల సమయం గడుపుతున్న యువతను గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంత ఉందో మీ పైన కూడా అంతే ఉంది. వారికి జ్ఞానోదయం చేయాల్సిన పరిస్థితి నేడు వేద పండితులకు ఉందని నా భావన. ఇలాంటి వినాయక మండపాలను మనము విజ్ఞాన కేంద్రాలుగా ఎందుకు తీర్చిదిదలేకపోతున్నాము. స్వామీజీలు, ప్రవచనకర్తలు ఈ సమయంలో అత్యధికంగా శ్రమించి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత మీపైన కూడా ఎంతో ఉందని విశ్వసిస్తున్నాను. ఒకపక్క హిందువుల ఐక్యంగా లేకపోవడం మూలంగా పోరుగు దేశం బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయినా మనకెందుకులే అని వ్యవహరిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఒక్కొక్క పూజారి తలుచుకుంటే ఒక్కొక్క గ్రామాన్ని మార్చి వేయగలరు మరి ఎందుకు ఆ కార్యచరణ జరగడం లేదు. ప్రతి పనికి మంచి కార్యానికి ముహూర్తం పెట్టే పంతులు. మన ధర్మం కోసం నిలబడడానికి నడుం కట్టాల్సిన పరిస్థితులు ఇప్పుడు మెండుగా ఉన్నాయి, అనే సంగతి మర్చిపోవద్దు. పూజ చేస్తే డబ్బులు వస్తున్నాయా లేదా అనేది ఎంత ముఖ్యమో మన ధర్మం ఇక్కడ నిలబడుతుందా ఇంకేమైనా వ్యవస్థలో మన పాత్ర ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచన చేస్తే అద్భుతంగా ఉంటుందని నా ఆవేదన. మీపై నేటికీ గ్రామాల్లో అన్ని పట్టణాల్లో సైతం మంచి నమ్మకం ఉంది సమాజాన్ని సంస్కరించాల్సిన ముఖ్యమైన పాత్ర ఇప్పుడు పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ పోషించడం లేదు అని నేను అనడం లేదు కానీ అందరూ ఒక మహా యజ్ఞం గా ఇలాంటి అవకాశాన్ని వాడుకుంటే సత్ఫలితాలు తొందరగా వస్తాయనేదే నా ఆవేదన. వేదాంతపరంగా సామాన్యుల కంటే తమరు తొందరగా సమాజాన్ని అర్థం చేసుకొని మేమే పరిస్థితులకు అనుగుణంగా ఒక పది నిమిషాలు మన ధర్మంపై అవగాహన కల్పిస్తారని చిన్న ఆశతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.
వ్యాసకర్త, తుమ్మ కృష్ణ సామాజిక కార్యకర్త.8374666327