జహీరాబాద్ బైపాస్ బ్రిడ్జ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
అతి వేగం వల్ల అదుపుతప్పి కిందపడిన కారు
ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు, 108లో ఆసుపత్రికి తరలింపు
ముంబై-హైదరాబాద్ హైవే పై ప్రమాదం
బైపాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి పల్టీ కొట్టిన కారు
జహీరాబాద్ మండలం రంజోల్ సమీపంలో సోమవారం రాత్రి ముంబై- హైదరాబాద్ హైవే- 65పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు అతి వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బైపాస్ బ్రిడ్జ్ పైనుండి క్రిందకు పడిపోయింది అని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా 108లో జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.