వృద్ధుల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర ఆదేశాల ప్రకారం గురువారం అమీన్‌పూర్‌లోని ది నెస్ట్ వృద్ధాశ్రమంను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి.సౌజన్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల పట్ల చిన్నచూపు చూడకుండా, వారి బాగోగులు చూసుకుంటూ గౌరవంగా చూడాలని సూచించారు. వృద్ధాశ్రమం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. న్యాయపరమైన అంశాల్లో సహాయం కావాలనుకునే వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె తెలిపారు. వీరి వెంట వృద్ధాశ్రమం అధికారులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment