పశువుల పోషణ లో జాగ్రత్తలు తీసుకోవాలీ 

పశువుల పోషణ లో జాగ్రత్తలు తీసుకోవాలీ

నాగల్ గిద్ద మండల పశువైద్యాదికారి డాక్టర్ రహీమ్ 

నాగల్ గిద్ద… పాడి రైతులు తమ పశువుల పెంపకం పోషణ లో తగు జాగ్రతలు తీసుకోవాలని నాగల్ గిద్ద మండల పశువైద్యాదికారి డా రహీమ్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా పశుఘణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు సంవర్ధక శాఖ సహకారం తో కారముంగి గ్రామం లో నిర్వహించిన పశువైద్య శిభిరం లో అయన పాల్గొని పశువులకు గర్భస్త పరీక్షలు నిర్వహించి తగిన. మందులు అందజేశారు ఈ సందర్బంగా ఆ యన రైతులకు పశుపోషణ ఫై అవగాహనా కలిపిస్తూ పాడి పశువులు పెయ్యాలు సకాలంలో ఎదకు వచ్చేలా మరియు చుడి కట్టేలా చూడాలని అన్నారు. మరియు ప్రతీ పశువుకు వ్యాధి నిరోధక టీకాలు వేయించు కోవాలని తెలిపారు. గోపాల మిత్ర సూపర్ వైజర్ తుక్కా రెడ్డి దూడల పోషణ గురుంచి వివరించారు. ఈ సందర్బంగా శిభిరంలో 16 పశువులకు గర్భస్థ పరీక్షలు 6 పశువులకు సాధారణ చికిత్సలు.2 పశువులకు గార్భాదారణ టీకాలు.21 దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. అన్నారు. ఈ కార్యక్రమంలో రహీమ్.జె వి ఓ విజయ్ కుమార్. సూపర్ వైజర్ తుక్కా రెడ్డి. వి ఏ రమేష్. గోపాల మిత్రులు శివరాజ్. సంతోష్ కుమార్ ఓ ఏస్ సంగమేష్. పాడి రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment