Site icon PRASHNA AYUDHAM

విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలి

IMG 20250712 WA0582

విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలి

మహబూబాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ విజేందర్ రెడ్డి

మహబూబాబాద్: జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ విజేందర్ రెడ్డి కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. వ్యవసాయ పొలాల దగ్గర స్టార్టర్ లకు మరియు మోటార్ లకు ఎర్తింగ్ చేసుకోవాలని అలాగే ఇంటి దగ్గర కూడా ఎర్తింగ్ చేసుకోవాలని తెలిపారు. గుండం గ్రామంలోనీ రైతులకి ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా ఏఈ కి సూచనలు అందించారు. ఈ వర్షాకాలంలో చెట్లు విరిగి లైన్ ల మీద పడడం లేదా లైన్ తెగి కింద పడిపోయినప్పుడు వెంటనే రైతులు తమ లైన్మెన్ లేదా AE కి సమాచారం అందించాలని కోరారు.విద్యుత్ ప్రమాదాల సమయం లో విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్ 1912 ఉపయోగించుకోవాలని తెలిపారు. కొత్తగూడ సెక్షన్ లో పనిచేస్తున్న ఇంజనీర్లకు మరియు విద్యుత్ సిబ్బందికి విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ డిఈ ఆపరేషన్ మహబూబాబాద్, సురేష్ ఏఈ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు…

Exit mobile version