సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 11 12 ( ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పనకు ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావడం ఆశించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో కెరియర్ టెక్నాలజీ సంస్థ సిబ్బంది పాఠశాలలను దత్తత తీసుకొని పాఠశాలలు వివిధ మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యాసంస్థల రూపురేఖలు మారుతాయి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రైవేట్ సంస్థల యాజమాన్యం సిబ్బంది కృషి చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రైవేట్ సంస్థల తోడ్పాటు అందించడం వల్ల నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ట్యాంకును తాగునీటి కుళాయిలను కలెక్టర్ పరిశీలించారు. సైన్స్ ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు. రూ 50 లక్షల తో క్లాస్ రూమ్స్ రెన్నోవేషన్ స్పోర్ట్స్ ఐటమ్స, సైన్స్ మెటీరియల్ను, మౌలిక సదుపాయాల ను కెరియర్ వారియర్ సభ్యులు చేపట్టినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సంస్థ యజమాన్యం సిబ్బంది చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కెరియర్ టెక్నాలజీ సంస్థ నిర్మాణ అధినేత నందా లక్కిరాజు, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థలో మౌలిక సౌకర్యాల కల్పనకు కెరియర్ టెక్నాలజీ సంస్థ కృషి హర్షనీయం: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Published On: March 12, 2025 7:43 pm
