ఢిల్లీ వాలా’ స్వీట్ హోమ్ పై కేసు నమోదు ..

ఢిల్లీ వాలా స్వీట్ హోమ్ పై కేసు నమోదు..

IMG 20240819 WA0043

నిజామాబాద్ పోలీసులు వేధిస్తున్నారంటూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఢిల్లీ వాలా స్వీట్ హోమ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్ హెచ్ విజయబాబు సోమవారం తెలిపారు. ఆదివారం పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం కాకుండా గాంధీ చౌక్ నుండి దేవీ రోడ్ సిగ్నల్ చౌరస్తా వరకు పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ వాలా స్వీట్ హోమ్ వద్ద రోడ్డుపైనే వాహనాలు పార్కు చేసి ఇబ్బందులకు గురి చేయడం కాకుండా రోడ్డుపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసు లతో ఢిల్లీవాలా స్వీట్ హోం వారు గొడవ పడ్డారు. అనంతరం పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని సదరు స్వీట్ హోమ్ యజ మాని ప్లెక్సీ ని ఏర్పాటు చేసి కొద్దిసేపు దుకాణాన్ని బంద్ చేశాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పార్కింగ్ కు ఎలాంటి స్థలం లేకుండా వ్యాపారం కొనసాగించడమే కాకుండా పోలీసులు వేధిస్తున్నారంటూ స్వీట్ హోమ్ యాజమాన్యం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొంతసేపు హడావుడి చేయడంపై ప్రజలు నివ్వెర పోయారు. ఈ సంద ర్భంగా ట్రాఫిక్ జామ్ అవుతోందని పోలీసులు తమను వేధిస్తున్నారని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దుకాణాన్ని మూసివేసిన ఢిల్లీవాలా స్వీట్ హోంపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు.తాము స్వీట్ హోం నిర్వా హకులను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని ఎస్ హెచ్ ఓ తెలిపారు

Join WhatsApp

Join Now