MLC పై తప్పుడు ప్రచారం.. Ntv రిపోర్టర్ పై కేసు నమోదు

MLC పై తప్పుడు ప్రచారం.. Ntv రిపోర్టర్ పై కేసు నమోదు

IMG 20241109 WA0077 1

వేంపల్లి : శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పై వేంపల్లి కి చెందిన యస్.చిన్న దస్తగిరి రెడ్డి ( Ntv రిపోర్టర్ ) సోషల్ మీడియా లో తప్పుడు సమాచారం తో ఆయన పరువుకు భంగం కలిగేలా పోస్టులు పెట్టారని కొనేరు మహేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వేంపల్లి సిఐ ఎ.సురేష్ రెడ్డి తెలిపారు.ఆయన కు సంభందం లేని విషయాన్ని ఆయన కు ఆపాదిస్తూ రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేలా పోస్టులు పెట్టారని ఆ పిర్యాదు లో పెర్కొన్నారు.సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టే వారిని వదలమని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో కేసుల పరంపరం జిల్లా లో కొనసాగుతోంది.. దస్తగిరిరెడ్డి పై గతం లో కూడా చక్రాయపేట మండలంలో ఇతర కేసులు నమోదు అయ్యాయని సమాచారం.. యం.యల్.సి కి చెడ్డపేరు వచ్చేలా పరువుకు భంగం వాటిల్లేలా పోస్టులు పెట్టిన చిన్న దస్తగిరి రెడ్డి పై చర్యలు తీసుకోవాలని మహేష్ కోరారు

Join WhatsApp

Join Now